భూముల డాక్యుమెంట్లు ఎలా బయటకొచ్చాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూముల డాక్యుమెంట్లు ఎలా బయటకొచ్చాయి

భూముల డాక్యుమెంట్లు ఎలా బయటకొచ్చాయి

Written By news on Wednesday, March 2, 2016 | 3/02/2016


భూముల డాక్యుమెంట్లు ఎలా బయటకొచ్చాయి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి చుట్టూ అధికార పార్టీ పెద్దలే భారీ స్థాయిలో భూములు కొల్లగొట్టడంపై టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ భు కుంభకోణం వెలుగు చూడటంతో అధికార టీడీపీ నేతలంతా బిత్తరపోయారు. రాజధాని పేరుతో ఇంత దోపిడీ చేశారా... అంటూ టీడీపీ నేతలే  విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ఇంతకాలం చేస్తున్న ప్రకటనల వెనుక ఇంత కథ నడిపించారా అని సహచర మంత్రులు, సీనియర్ నేతల మధ్య చర్చోపచర్చలకు దారితీసింది.

చవక ధరలకు భూములను కైవసం చేసుకున్న డాక్యుమెంట్లు ఎలా బయటపడ్డాయని ముఖ్యమంత్రి సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు ఎంపీలు మురళీమోహన్ తదితరులే కాకుండా బినామీలతో పెద్దఎత్తున చవక ధరలకు భూములు కాజేసిన వైనంపై సాక్షి బుధవారం పూర్తి ఆధారాలతో కథనాలు ప్రచురించింది. ఈ కథనాలు టీడీపీ నేతల్లో కలకలం సృష్టించింది. నేతల బండారం బయటపడటంతో ఏం చేయాలని పలువురు మంత్రులు పరస్పరం చర్చించుకున్నారు.

ఈ కథనాలపై ఎలా కౌంటర్ ఇవ్వాలో సీఎంతో మాట్లాడటానికి ఇద్దరు సీనియర్ మంత్రులు బుధవారం ఉదయమే ఆయన కార్యాలయానికి వెళ్లారు. వారిద్దరిని చూడగానే చంద్రబాబు ఇంతెత్తున లేచారు. ఇష్టానుసారంగా ఇలా డాక్యుమెంట్లు ఎలా బయటకు పోతున్నాయంటూ మండిపడ్డారు. ఎక్కడి నుంచి బయటకు పొక్కాయో తెలుసుకోండంటూ అక్కడే ఉన్న ఉన్నతాధికారులను పురమాయించినట్టు తెలిసింది. ఇకనుంచి ఏ ఒక్క డాక్యుమెంట్ బయటకు రావడానికి వీలులేదని ఆదేశించారు.

ఇకపోతే ఈ వ్యవహారంపై సొంత పార్టీలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతపనిచేశారంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటివేవో ఉంటాయనే రాజధానికి సంబంధించిన విషయాల్లో మొదటి నుంచి తాను దూరంగా ఉంటున్నానని రాయలసీమకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు సన్నిహితులతో చెప్పారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో ఏం చేశారో సరిగ్గా ఇక్కడ కూడా అదే ప్లాన్ తో ముందుకెళ్లినట్లున్నారని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తాజా వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట, పరువు పోయిందని మరో సీనియర్ నేత చెప్పారు. రాజధాని పరిసర ప్రాంతాలు, రాజధాని చుట్టూ చేపట్టే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కీలక ప్రాంతాల్లో అనేక వేల ఎకరాలు ఇలా బినామీల చేతుల్లోకి మారాయన్న విషయంలో మొదటి నుంచి పార్టీ నేతల్లో అనుమానాలున్నాయని, ఇప్పుడవి నిజమయ్యాయని గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించిన రోజు నుంచే రైతుల నుంచి భూ సమీకరణ బాధ్యతలను మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులకు ముఖ్యమంత్రి అప్పగించారు. ఆరోజు నుంచే మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను సింగపూర్ కు చెందిన ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం, ఆ తర్వాత వరుస పరంపరగా వాటిల్లో మార్పుచేర్పులు చేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ ఎత్తున భూములను కైవసం చేసుకోవడం, బినామీలను రంగంలోకి దింపడం వంటి అక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు స్పష్టమైంది.
Share this article :

0 comments: