ఇది ‘విజయమాల్యా’ బడ్జెట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ‘విజయమాల్యా’ బడ్జెట్

ఇది ‘విజయమాల్యా’ బడ్జెట్

Written By news on Saturday, March 12, 2016 | 3/12/2016


ఇది ‘విజయమాల్యా’ బడ్జెట్
♦ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారు
♦ విపక్ష ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శ

 సాక్షి, హైదరాబాద్: గడిచిన 60 ఏళ్ల చరిత్రలో లేనివిధంగా చంద్రబాబు సర్కారు వ్యవహరించిందని, బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి దాచిపెట్టిందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం విమర్శించింది. పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. విజయమాల్యా వాస్తవాలను దాచిపెట్టి బ్యాంకులను మోసం చేసినట్టే.. చంద్రబాబు సర్కార్ వాస్తవ అంకెలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన దుయ్యబట్టారు. ఇదో బోగస్ బడ్జెట్, విజయమాల్యా బడ్జెట్ అని విమర్శించారు.

ఈసారి బడ్జెట్‌లో 2014 -15 సంవత్సరపు ఆడిట్ చేసిన బడ్జెట్ గణాంకాలను తెలియజేయలేదని.. ప్రస్తుత ఆర్థిక ఏడాది 2015-16కి సంబంధించి 11 నెలల పాటు రాష్ట్రానికి వచ్చిన ఆదాయ వివరాలు తెలిసిన తరువాత కూడా, ఏడాది కిత్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు చూపించిన గణాంకాలనే, ఇప్పుడూ రివైజ్డు బడ్జెట్ అంచనాలుగా చూపించారని చెప్పారు. రివైజ్డు బడ్జెట్ గణాంకాలకు, బడ్జెట్ ప్రాథమిక అంచనాలకు సాధారణంగా తేడా ఉంటుందని, కానీ  ప్రభుత్వం కాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ వివరాలను బడ్జెట్ అంచనాల్లో, రివైజ్డు బడ్జెట్ అంచనాల్లో ఒకే అంకెలను చూపించారన్నారు. మంత్రివర్గం మొత్తం కూర్చొని, చర్చించి, నిర్ణయించి ఇచ్చే బడ్జెట్‌ను ఇలా ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కావాలనే చేసినట్టు అర్థమవుతోందన్నారు.

 దాచాల్సిన అవసరం ఏమివచ్చింది?: రాష్ట్రానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలు ప్రజలకు, ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా దాచిపెట్టేందుకే రెండు చోట్ల ఒకే రకమైన అంకెలను చూపించారని కాకాణి ఆరోపించారు. ఇలాంటి బోగస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇలా చేయడం నేరమన్నారు. ఆదాయ, వ్యయాల వివరాలు బయటపడతాయనే కావాలని ఆ వివరాలను దాచిపెట్టారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Share this article :

0 comments: