హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిదేళ్లు పూర్తి చేసుకుని ఆరో ఏట అడుగిడనుంది. శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని జిల్లా, నియోజకవర్గాలు, మండల, గ్రామస్థాయిలో పార్టీ జెండాలు ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ప్రతిపక్ష హోదా ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలను ప్రజలకు వివరించాలని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.
కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఇడుపులపాయ సాక్షిగా వైఎస్ జగన్ 2011 మార్చి 12న కొత్తపార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

0 comments:
Post a Comment