ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే

ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే

Written By news on Sunday, March 6, 2016 | 3/06/2016


'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం నగరంలోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చెప్పారు.
సుశీల్, డ్రైవర్ అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే అని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించాకే సుశీల్ పై నిర్భయ కేసు నమోదు చేశామని డీసీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 
Share this article :

0 comments: