గాంధీ విగ్రహం వద్ద జగన్, ఎమ్మెల్యేల బైఠాయింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాంధీ విగ్రహం వద్ద జగన్, ఎమ్మెల్యేల బైఠాయింపు

గాంధీ విగ్రహం వద్ద జగన్, ఎమ్మెల్యేల బైఠాయింపు

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016


గాంధీ విగ్రహం వద్ద జగన్, ఎమ్మెల్యేల బైఠాయింపు
హైదరాబాద్ :
ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని స్పష్టంగా హైకోర్టు చెప్పినా, ఆమెను లోనికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నేల మీదే బైఠాయించారు. శాంతియుత మార్గంలో నిరసన తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలతో పాటు మొత్తం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ సుమారు గంట నుంచి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద కోర్టు తీర్పు కాపీ ఉందని, మీ వద్ద ఎలాంటి ఉత్తర్వులు ఉన్నాయో చూపించాలని అడిగినా చీఫ్ మార్షల్‌ ఏమీ చూపించలేకపోయారు.
 
రోజాను సభలోకి అనుమతించకుడదని స్పీకర్ చెబితే, అందుకు తగిన ఆధారాలు చూపించాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. గంట సేపటి నుంచి మార్షల్స్ ను అడుగుతున్నప్పటికీ చీఫ్ మార్షల్ ఎలాంటి ఉత్తర్వులను చూపలేకపోయారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆమెకు సభలోకి వెళ్లే అధికారం ఉందని, ఏపీ సర్కారు పెద్దలు హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్రలకు పాల్పడుతోందంటూ వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
Share this article :

0 comments: