Home »
» పొట్టి శ్రీరాములుకు వైఎస్ జగన్ నివాళి
పొట్టి శ్రీరాములుకు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్ఆర్ సీఎల్పీ ఆఫీసులో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, సుజయ్ కృష్ణ రంగరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు నుంచి విభజించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 51 ఏళ్ల వయసులో మరణించారు. ఈ రోజు ఆయన 115వ జయంతి.
0 comments:
Post a Comment