మీ తరఫున పోరాడేది నేనొక్కడినే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ తరఫున పోరాడేది నేనొక్కడినే..

మీ తరఫున పోరాడేది నేనొక్కడినే..

Written By news on Wednesday, March 2, 2016 | 3/02/2016


మీ తరఫున పోరాడేది నేనొక్కడినే..
♦ ఇళ్ల తొలగింపుపై స్టే తెచ్చింది నేనే..
♦ అవసరమైతే వారికోసం నిరాహార దీక్ష చేస్తా..
♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
♦ 38, 39,45,46,47,48 డివిజన్లలో ఇంటింటి ప్రచారం, రోడ్ షో
♦ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన

 టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకపోతే మీ ఇళ్లు పీకేస్తామని బెదిరించిన సంగతి నా దృష్టికి వచ్చింది. మీ ఇళ్లను ఎవరూ తొలగించలేరు. వాటికి పట్టాలిప్పిస్తా. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఒక్కొక్కటి ఏర్పాటు చేయిస్తా. నా వెనుక మంత్రులు, సీఎంలు లేరు. నేనొక్కడినే.. మీ అందరి కోసం పోరాడతా. ఎంపీగా గెలవక ముందు శ్రీనివాస నగర్‌లో ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే.. వారి తరఫున హైకోర్టు నుంచి స్టే తెచ్చాను. ఇప్పటికీ వాళ్ల జోలికి వెళ్లిన వారు లేరు. ఇలాగే మీ ఇళ్లకు పట్టాలు వచ్చేందుకు అవసరమైతే మీ మధ్యలోనే కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాల్వకట్ట ప్రజలకు భరోసానిచ్చారు.
ఖమ్మం :  కార్పొరేషన్ పరిధిలోని  38,39,45,46,47,48 డివిజన్లలో అభ్యర్థుల గెలుపు కోసం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 39వ డివిజన్‌లో...
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. 39వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డా నాగేశ్వరరావు(నగేష్)ను మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థించారు. కాల్వకట్టపై పాదయాత్ర చేస్తూ.. ఇంటింటి ప్రచారం చేపట్టారు. గతంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ైవె ఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డా నాగేశ్వరరావు పరిష్కరించారని కాలనీవాసులు చెప్పారు. సేవచేసే నాగేశ్వరరావుకు ఓట్లేస్తామని ఎంపీ పొంగులేటికి హామీ ఇచ్చారు. అనంతరం వారితో ఎంపీ మాట్లాడుతూ.. 39వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డా నాగేశ్వరరావు(నగే ష్)ను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో డివిజన్ నాయకులు వల్లూరి తిరుపతిరావు, శింగు శ్రీనివాసరావు, కోటి మోహన్‌రెడ్డి, పీరూనాయక్, తోట వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, సురేందర్, మోహన్‌రాజా, నాగరాజు, పి.స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
 38వ డివిజన్‌లో...
38వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డోన్‌వాన్ ప్రియాంకను గెలిపించాలని కోరుతూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. గుట్టల బజార్, సుందర్, కిన్నెరసాని థియేటర్ ఏరియా, జహీర్‌పురా, ఎస్సీ కాలనీ ఏరియాల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. నీటి సరఫరా, డ్రెయినేజీ, శ్మశాన వాటిక సమస్యల పరిష్కారంతోపాటు డివిజన్ సుందరీకరణ కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిని డోన్‌వాన్ ప్రియాంకను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ధోన్‌వాన్ స్వాతి, సైదాబాయి, భట్టు స్వాతి, రాజు, లింగన్న, కృష్ణ, సురేష్, ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
 45వ డివిజన్‌లో...
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 45వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర్లె నాగకమలను గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. డివిజన్ పరిధిలోని మార్కెట్ ఏరియాతోపాటు పలు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి, అభ్యర్థిని బూర్లె నాగకమల రోడ్‌షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రచారంలో గుండపనేని ఉదయ్‌కుమార్, సింగం రామ్మూర్తి, కంబాల శ్రీను, గురుమూర్తి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
 46వ డివిజన్‌లో...
46వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని బాణాల అనితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. డివిజన్‌లోని పారిశుద్ధ్య, తాగునీరు, అంతర్గత రోడ్ల ఏర్పాటుకు కృషి చేసిన బాణాల అనితను గెలిపించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలకు స్థలం కేటాయించేలా ప్రభుత్వంపై పోరాడుతామని, దీనికోసం తనను గెలిపించాలని బాణాల అనిత కోరారు. ప్రచారంలో కేవీ.చారి, బాణాల లక్ష్మణ్, చిత్తూరు నాగేశ్వరరావు, దుర్గారావు, ఉపేందర్, సతీష్, సురేష్, పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.
 47వ డివిజన్‌లో...
47వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి సంపెట వెంకటేశ్వర్లు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని జగనన్న అడుగుజాడల్లో ప్రజా సేవ చేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డివిజన్‌లో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన నిస్వార్థపరుడు సంపెట వెంకటేశ్వర్లు అని అన్నారు. ఎలాంటి చందాలు, దందాలు లేకుండా... ఎవరికి ఏ పని కావాలన్నా.. తనను ఆశ్రయిస్తే అందరికీ సేవ చేసుకుంటానని సంపెట వెంకటేశ్వర్లు అన్నారు. డివిజన్‌లో రోడ్‌షో, ఇంటింటి ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
 48వ డివిజన్‌లో...
ఇద్దరు కొడుకులు డాక్టర్లు.. మంచి సంపాదన.. ప్రశాంత జీవితం అనుభవించే నిస్వార్థపరుడు చిత్తలూరి నర్సయ్యగౌడ్ అని.. తన జీవితంలో ఎక్కడా ఎవరినీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని.. ఇతర వ్యక్తుల మాదిరిగా బెదిరింపులకు పాల్పడే వ్యక్తి కాదని.. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి చిత్తలూరి నర్సయ్య గౌడ్‌ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. నర్సయ్యగౌడ్‌ను గెలిపించి హామీలు నిలబెట్టుకోలేని టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రచారంలో పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాదు రమేష్‌రెడ్డి, సింగరపు యాగలక్ష్మి, కేవీ.చారి, బీ.లక్ష్మిరెడ్డి, వట్టం రాంబాబు, రంజిత్, సురేష్, ఏడుకొండలు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: