మంత్రి రావెల కొడుకు సుశీల్‌పై నిర్భయ కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మంత్రి రావెల కొడుకు సుశీల్‌పై నిర్భయ కేసు

మంత్రి రావెల కొడుకు సుశీల్‌పై నిర్భయ కేసు

Written By news on Saturday, March 5, 2016 | 3/05/2016


హైదరాబాద్: ఏపీ మంత్రి రావెల కిషోర్ కొడుకు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు నిర్భయ కేసు నమోదుచేశారు. ఈ మేరకు మంత్రి రావెల క్వార్టర్స్‌కు వెళ్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. 41 (ఏ) సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ బంజరాహిల్స్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై మంత్రి రావెల కొడుకు సుశీల్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అతని కీచక పర్వంపై మీడియా వరుస కథనాలతో బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. మంత్రి కొడుకు సుశీల్‌ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. సుశీల్‌ బాధిత మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని అభియోగాలు మోపారు. తప్పతాగి అతను తనను వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొడుకును అప్పగిస్తానన్న రావెల!
ఈ కేసులో తన కొడుకు సుశీల్‌ను పోలీసులకు అప్పగిస్తానని మంత్రి రావెల తెలిపారని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉదయం నుంచి ఈ విషయమై మంత్రి రావెలను సంప్రదిస్తున్నామని, అయితే మంత్రి రావెల ఇంతవరకు అందుబాటులో రాలేదని చెప్పారు. రాలేదని తెలిపారు.
Share this article :

0 comments: