సాక్షి, హైదరాబాద్: ఇటువైపు ఒకే ఒక్కడు... అటువైపు 16 మంది. ఇటువైపు ఆ ఒకే ఒక్కడు ఆడింది టీ20 మ్యాచ్. అటువైపు 16 మంది చేసింది నెట్ ప్రాక్టీస్. ఇది బుధవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కనిపించిన దృశ్యం. ఆ ఒకే ఒక్కడు శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆ 16 మంది సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మంగళవారం ప్రారంభించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ బుధవారం కొనసాగించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించారు. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ప్రసంగం పలుమార్లు అవాంతరాల మధ్య సాయంత్రం 4.20 గంటల వరకూ కొనసాగి వైఎస్సార్‌సీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ముగిసింది

0 comments:
Post a Comment