ఆమె ప్రజాక్షేత్రంలో పోరాడి మళ్లీ సుమారు 420 సీట్లు గెలిచి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆమె ప్రజాక్షేత్రంలో పోరాడి మళ్లీ సుమారు 420 సీట్లు గెలిచి..

ఆమె ప్రజాక్షేత్రంలో పోరాడి మళ్లీ సుమారు 420 సీట్లు గెలిచి..

Written By news on Thursday, April 28, 2016 | 4/28/2016


- ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదు
- వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి

పుత్తూరు(చిత్తూరు జిల్లా) : 
 వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి వెంట జనం ఉన్నారని, ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ ఫిరాయించినా నష్టం లేదని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. గురువారం పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.  పార్టీ నుంచి కొందరు స్వార్థపరులు మాత్రమే టీడీపీలోకి వెళ్లార ని జనమంతా జగన్‌మోహన్ రెడ్డితోనే ఉన్నారన్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఇలాంటి పరిణామాలే ఎదురయ్యాయని, ఆమె ప్రజాక్షేత్రంలో పోరాడి మళ్లీ సుమారు 420 సీట్లు గెలిచి ప్రధాని అయ్యారని ఆయన గుర్తుచేశారు.

 చంద్రబాబు ప్రలోభాలను నమ్మి వెళ్లిన వారు రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతారన్నారు. ఆస్తులను కాపాడుకునేందుకే సీనీయర్ నాయకుడు మైసూరారెడ్డి పార్టీని వీడారని విమర్శించారు. ఆయనకు ప్రజలకంటే పదవులపైనే మక్కువ అని ఆయన చరిత్రను పరిశీలిస్తే ఇది అర్థం అవుతుందన్నారు. ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందనే భావనతో ఆయనే పార్టీలోకి వచ్చారని గుర్తుచేశారు. జగన్‌మోహన్ రెడ్డి డబ్బు మనిషి అని మైసూరారెడ్డి ఆరోపణలు చేయడాన్ని నారాయణస్వామి ఖండించారు.

 పార్టీని వీడిన వారంతా డబ్బు కోసమే వెళ్లారని, మైసూరారెడ్డి కూడా ఆ కోవకు చెందినవారేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు రాజకీయ కుయుక్తులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు దిగుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జనమే జగన్‌కు పట్టం కడతారని అన్నారు.
Share this article :

0 comments: