నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర

నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర

Written By news on Monday, April 25, 2016 | 4/25/2016


నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర
♦ జాతీయ స్థాయికి చంద్రబాబు దుర్నీతి
♦ జాతీయ పార్టీల నేతల్ని కలసి వివరించనున్న జగన్ బృందం
♦ మూడురోజులపాటు ఢిల్లీలోనే..
♦ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని సైతం కలవాలని నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: 
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘సేవ్ డెమొక్రసీ’(ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అని నినదిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారు. 25వ తేదీ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరనున్న ఎమ్మెల్యేలు 26, 27 తేదీల్లోనూ ఢిల్లీలోనే ఉంటారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును, నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్న తీరును వివిధ జాతీయ పార్టీల నేతలను కలుసుకుని వివరిస్తారు.

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ తానే స్వయంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాను కప్పుతున్న వైనాన్ని కూడా దేశం దృష్టిని ఆక ర్షించేలా తెలియజేయబోతున్నారు. చంద్రబాబు దుర్నీతి, అవినీతి పాలనపై రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను వైఎస్ జగన్ ఈనెల 23న కలసి ఫిర్యాదు చేయడం తెలిసిందే. అదేరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ‘సేవ్ డెమొక్రసీ’లో భాగంగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. అన్నిచోట్లా భారీ సంఖ్యలో ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొని తమ మద్దతును ప్రకటించడం విదితమే.

ఈ నేపథ్యంలో రాష్ర్టంలో తెలుగుదేశం అధినేత సాగిస్తున్న అనైతిక రాజకీయ కార్యకలాపాల గురించి జాతీయస్థాయిలో ఎండగట్టే చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీయాత్ర తలపెట్టింది. ఢిల్లీ వెళుతున్న పార్టీ ఎమ్మెల్యేలు.. వివిధ జాతీయ పార్టీల అధ్యక్షులు లేదా పార్లమెంటరీ పార్టీల నేతల్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌లను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలవాలని కూడా నిర్ణయించారు. వారిచ్చే సమయాన్ని బట్టి ఈ మూడు రోజుల్లో కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారు.
Share this article :

0 comments: