రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్టా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్టా?

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్టా?

Written By news on Thursday, April 14, 2016 | 4/14/2016


రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్టా?
చంద్రబాబుపై అంబటి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగానికి నిత్యం తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల  విగ్రహాన్ని ప్రతిష్టించే నైతిక అర్హత ఉందా? లేదా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని దళితులను కించ పర్చేలా మాట్లాడటమే కాకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అసలు అంబేడ్కర్‌ను స్మరించుకునే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందే ఎస్సీలపై తాను చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయన్ను ఎవరూ క్షమించరని అంబటి అన్నారు. మహనీయుల ఆశయాలు ఎపుడూ చంద్రబాబు అమలు చేయరని విమర్శించారు. మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతిని చంద్రబాబు నిర్వహించారని అయితే బీసీల సంక్షేమానికి ఏటా రూ. 10,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి ఈ రెండేళ్లలో ఐదారు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇపుడు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో సగం కూడా వారి కోసం ఖర్చు చేయలేదన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రోజూ ఎన్టీఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేస్తున్నారన్నారు.

 రేటు బాగా ఉంది...
 వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు అంబటిని ప్రశ్నించగా.. ‘‘ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లి పోయారు, ఇంకో ఇద్దరు వెళితే వెళ్లొచ్చు... రేటు బాగా ఉంది’’ అని అంబటి సమాధానమిచ్చారు. నిన్నటిదాకా ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ. 30 కోట్ల వరకూ రేటు ఉండేదని అదిపుడు రూ. 30 కోట్లు నుంచి రూ. 40 కోట్లకు పెరిగిందన్నారు. ‘చంద్రబాబు చాలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో వీళ్లందరినీ కొంటున్నారు.. పాపం ఆయన అసలు అవినీతే చేయడం లేదు. లోకేశ్‌బాబూ అవినీతి చేయడం లేదు’ అని వ్యంగ్యంగా చెప్పారు. ఆ ఎమ్మెల్యేలతో ఏంచేస్తారో అని అన్నారు.
Share this article :

0 comments: