చంద్రబాబుపై అంబటి ధ్వజం.. అది లోకేష్ మజ్జిగ స్రవంతి అని ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలను ఆ దుకోవాలని సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం లేదని, రాష్ట్రంలో ఏర్పడే ప్రతి సంక్షోభాన్ని ఆయన తన దోపిడీకి వినియోగించుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంచినీటి సరఫరా కోసం రూ 200 కోట్లు, మజ్జిగ పంపిణీ కోసం జిల్లాకు రూ 3 కోట్లు చొప్పున రూ 39 కోట్లు విడుదల చేయడం టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టడానికేనని అనుమానం వ్యక్తం చేశారు.
దాహార్తితో ఉన్న ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉచిత మజ్జిగ పథకం ప్రవేశ పెట్టడం విడ్డూరమన్నారు. బాబు తన తొలి సంతకాల్లో ఒకటైన ఎన్టీఆర్ సుజల స్రవంతి (రూ.2కే రోజుకు 20 లీటర్ల మినరల్ వాటర్) పథకాన్ని అమలు చేయకుండా ఇపుడు లోకేష్ మజ్జిగ స్రవంతి పథకాన్ని ప్రవేశ పెడుతున్నారన్నారు. చంద్రన్న కానుక పథకంలో పుచ్చిన శనగలు, బెల్లం, నెయ్యి వంటివి హెరిటేజ్ నుంచి కొనుగోలు చేసి దోపిడీ చేసినట్లుగానే ఈ మజ్జిగ పథకం తెచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment