రైల్వేజోన్ ఉద్యమం.. మరింత ఉధృతం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైల్వేజోన్ ఉద్యమం.. మరింత ఉధృతం: వైఎస్ జగన్

రైల్వేజోన్ ఉద్యమం.. మరింత ఉధృతం: వైఎస్ జగన్

Written By news on Monday, April 18, 2016 | 4/18/2016


రైల్వేజోన్ ఉద్యమం.. మరింత ఉధృతం: వైఎస్ జగన్
విశాఖపట్నం :
విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఉద్యమం ఆగలేదని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రైల్వేజోన్ కోసం విశాఖపట్నంలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌కు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...

ఐదు రోజులుగా అమర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించలేదు.
నిజానికి ఫలానా తేదీలోపు కచ్చితమైన ప్రకటన చేయాలని, లేకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని నెల రోజుల క్రితమే అమర్ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖ రాశారు
లేఖ రాసిన నెల రోజుల తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అంబేద్కర్ జయంతి రోజున అమర్ నిరాహార దీక్ష ప్రారంభించారు
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదు
ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పడం, తర్వాత ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు విశ్వసనీయత
ఎన్నికలకు ముందు రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానన్నారు.
ఇప్పుడు ఆయన చేసిన రుణమాఫీ కార్యక్రమం రైతులకు వడ్డీలలో మూడోవంతు కూడా సరిపోవడం లేదు
డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానన్నాడు
ఎన్నికలు అయిపోయాక రుణాల మాఫీ దేవుడెరుగు, రెండు రూపాయల వడ్డీ కట్టే దుస్థితికి తీసుకొచ్చాడు
జాబు రావాలంటే బాబు సీఎం కావాలంటూ పెద్దపెద్ద పోజులు కొట్టాడు, ప్రకటనలు చేశాడు
ఎన్నికలు అయిపోయాయి బాబు సీఎం జాబులో కూర్చున్నాడు, ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే కార్యక్రమం చేస్తున్నాడు
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామన్నాడు, ఈవాళ కొన్ని శాఖల్లో ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు
వీళ్లందరికీ ఉద్యోగాలు ఊడబీకే కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది
ఉద్యోగాలు రాకపోతే ఇంటికొకరికి 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, అందరినీ మోసం చేశాడు
చదువుకున్న పిల్లలకు ఉపయోగపడేది ప్రత్యేక హోదా. అది వస్తే, ఆ హోదా వల్ల జరిగే మేలు వల్ల ప్రతి పారిశ్రామిక వేత్తకు పన్ను రాయితీలు వస్తాయి కాబట్టి పారిశ్రామిక వేత్తలు బయటి నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తారు, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి
ఆ ప్రత్యేక హోదాను సైతం ఆయన పణంగా పెట్టినా అడిగే నాథుడు లేడు
రైల్వేజోన్ కూడా అంతే. నిజంగా రైల్వే జోన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకుముందు మనకున్న ఒకే రైల్వేజోన్ తెలంగాణకు వెళ్లిపోయింది.
మనకు నాలుగు డివిజన్లు ఉన్నాయి గానీ, ఒక్క జోన్ కూడా రాలేదు
మనకు రావల్సిన జోన్ ఒడిసాలో ఉంది. జోన్ ఉన్నచోటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ఉంటుంది
మొన్న ఆర్ఆర్‌బీ పరీక్షలు నిర్వహిస్తే, మనవాళ్లు ఒడిషాకు వెళ్లినప్పుడు వీళ్లను రానివ్వకుండా తరిమికొట్టారు
ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది?
ప్రత్యేక హోదా తేరు, ఉద్యోగాలు ఇవ్వరు, కనీసం రైల్వే జోన్ కూడా తెప్పించడం లేదు
బిహార్‌లో రైల్వే జోన్ ఉంది.. మనవాళ్లు అక్కడకు పోయి ఉద్యోగాలు చేయరు
ఇదంతా తెలిసినా దాన్ని పట్టించుకునే నాథుడు లేడు
ఒకసారి రైల్వేజోన్ వస్తే 16 హెచ్‌ఓడీలు వస్తారు. వాళ్లందరూ ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
జోన్‌కు సంబంధించిన రైల్వే లైన్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి వెళ్తాయి.
కొత్త రైల్వే లైన్లకు ఊతం రావాలన్నా కూడా మనకకు ఒక జోన్ రావాలి
ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు
అడగాల్సిన వాళ్లు అడగడం లేదు
చంద్రబాబు సీఎం అయి రెండేళ్లయిపోయింది. ఏం చేస్తున్నారు? కేంద్రం నుంచి మనకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వనరులు, రైల్వేజోన్.. ఇలాంటి హామీలు రాకపోతే మీరు కేంద్రంలో మీవాళ్లను ఎందుకు మంత్రులగా కొనసాగిస్తున్నారు?
కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా చంద్రబాబు పట్టించుకునే పరిస్థితిలో లేడు
గట్టిగా నిలదీసి అడిగితే.. ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న విషయంపైన, పక్క రాష్ట్రంలో ఆడియో వీడియో టేపులతో బయటపడ్డ విషయంపైన ఎక్కడ విచారణలు జరుగుతాయోనని భయపడి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాడు
చంద్రబాబుకు, తన పాలనకు పైనుంచి దేవుడు, కిందనుంచి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
ప్రజలు బాబును రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది
నువ్వు అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన మా ఎమ్మెల్యేల చేత రాజీనామా ఎందుకు చేయించడం లేదు, వాళ్లను ఎందుకు అనర్హులుగా ప్రకటించడం లేదు?
ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్లండి.. ప్రజలు మీకు ఓటేస్తారో, మాకు ఓటేస్తారో తేలిపోతుంది
తాను అవినీతి సొమ్ముతో ప్రలోభపెట్టిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయరు, రాజీనామా చేయించరు, ఎన్నికలకు వెళ్తే మళ్లీ గెలుస్తానో లేదోనన్న అపనమ్మకం ఆయనకుంది
అమర్ వయసులో చిన్నవాడు.. యువకుడు. అతడి నుంచైనా నేర్చుకుని చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని ఆశిస్తున్నా
ఈ ఉద్యమంలో అమర్‌కు, వైఎస్ఆర్‌సీపీకి సంఘీభావంగా ఉంటున్న వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ.. అందరికీ కృతజ్ఞతలు.
ఈ పోరాటానికి మద్దతిచ్చిన కార్మిక సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, జర్నలిస్టు సంఘాలు, మహిళా సంఘాలు, బార్ అసోసియేషన్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
రాత్రి 11 గంటల ప్రాంతంలో శిబిరం మీద దాడిచేసి, దీక్ష కొనసాగనివ్వకుండా ఎలా చేశారో చూశాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదు, రాబోయేకాలంలో దీనిపై ప్రణాళికలు రచించి, ఉద్యమం కొనసాగిస్తాం. అందరం కలసికట్టుగా దీనిపై పోరాడతాం
Share this article :

0 comments: