టీడీపీకి చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి చుక్కెదురు

టీడీపీకి చుక్కెదురు

Written By news on Thursday, April 21, 2016 | 4/21/2016


టీడీపీకి చుక్కెదురు
కార్పొరేషన్ ఎన్నికల నాడిపై సర్వే
  36 వార్డుల్లో నిఘా    బృందాల పరిశీలన
  వైఎస్సార్‌సీపీకే  అనుకూలం
  ప్రభుత్వానికి సర్వే  తొలి నివేదిక
  కొనసాగుతున్న  మలి సర్వే
ఇప్పటికిప్పుడు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఆధిక్యం వస్తుంది? ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయా? పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా? ఎవరికి ప్రాతినిధ్యం వెళ్తుంది? ఏఏ వార్డుల్లో ఎవరి హవా ఉంది? అధికార తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఎలా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రజల తరఫున పోరాడే పరిస్థితిలో ఉన్నారా? ఈ అంశాలపై నిఘా బృందాలు సర్వే చేపట్టాయి. హైదరాబాద్‌లోని అదనపు డీజీపీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే తొలి నివేదిక ప్రభుత్వానికి అందజేసిన సిబ్బంది రెండో దశ సర్వేకు సిద్ధమయ్యారు.

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రానున్న ఎన్నికల్ని ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో జరుపుతుందా. పరోక్ష పద్ధతి వైపే మొగ్గు చూపుతుందా? యువత ఏం కోరుకుంటోంది. మహిళలు ఏం అంటున్నారు, పింఛన్‌దారులు ఏం చెబుతున్నారు, సామాజికవర్గాల విశ్లేషణ ఎలా ఉందన్న అంశాలతో ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పుడున్న 36 వార్డుల్లోనే ఎన్నికలు జరిపిస్తారా? మునిసిపాలిటీ కార్పొరేట్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో డివిజన్ల సంఖ్య పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

 రెండు నెలల క్రితం వార్డుల వారీ జరిపిన సర్వే ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు, సిబ్బంది బృందం, తాజా గా రెండో నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. తొలి సర్వే టీడీపీకే కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మారుతున్న పరిస్థితులు వైఎస్సార్‌సీపీకే పూర్తి మెజార్టీతెచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం తీరు పట్ల నిర్వేదంలో ఉన్న జనం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకే మొగ్గుచూపిస్తున్నారు.

 ఇసుకలో భారీగా సొమ్ములు వెనకేసుకున్న టీడీపీ తమ్ముళ్లపై జనం గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఒక్క ఇల్లూ ఇవ్వలేకపోయింది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లతో పనిచేస్తున్నారు. వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తమ వారికే సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారు. నగరంలో 36వార్డులదీ అదే పరిస్థితి.


 కేసీఆర్ వ్యూహంతోనే
 తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్వకంగా వ్యవహరించి, సర్వే ఫలితాల్ని ముందే తెప్పించుకుని ఎన్నికలకు వెళ్లింది.  జనం భావాల్ని అర్థం చేసుకుని దూసుకుపోయి మేయర్ పీఠం దక్కించుకుంది. అదే వ్యూహాన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వ్యవహరించి ఫలితాలు తెచ్చుకునేందుకు టీడీపీ ఆరాటపడుతున్నట్టు తెలిసింది. దీంతో సర్వే చేయాలంటూ పోలీసుశాఖ ద్వారా వివరాలు రప్పించుకుంటున్నట్టు సమాచారం. ఓటర్ల మనోభావాలు ఏ రోజుకారోజు మారిపోతున్నాయి. టీడీపీ పట్ల జనం పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎవరూ సంక్షేమ ఫలాల్ని అందుకోలేకపోతున్నారు. ఇదే విషయాలపై నిఘా బృందాలు ఆరా తీస్తే వైఎస్సార్‌సీపీకే మెజార్టీ ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారని తేలింది.

 వార్డుల్లో ఇదీ పరిస్థితి
 నగరంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజార్టీ లభించే అవకాశాల్లేవని నిఘా బృందాలు తేల్చాయి. టీడీపీ పట్ల కేవలం 17వార్డులకే ప్రజలు మొగ్గు చూప్తున్నారని, మిగతా 19వార్డులూ వైఎస్సార్‌సీపీయే కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ ఫీఠం దక్కించుకుంటుందని వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ వైఎస్సార్‌సీపీకి మరింత మెజార్టీ వస్తుందని, టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే వైఎస్సార్‌సీపీకి దగ్గర చేస్తుందని నిఘా బృందాలు తేల్చినట్టు తెలిసింది. వార్డుల్లో 1, 2, 4, 7, 9, 11, 12, 14, 16, 21, 22, 24, 25, 26, 27 వార్డుల్లో దాదాపు వైఎస్సార్‌సీపీనే ఖరారు చేసేసింది. రిజర్వేషన్ల ప్రతిపాదిక, అభ్యర్థుల గుర్తింపు వంటి అంశాల్ని వైఎస్సార్‌సీపీ గుర్తిస్తే మిగతా వార్డుల్లోనూ సునాయాసంగా విజయం సాధిస్తుందని నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం.
Share this article :

0 comments: