సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి

సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి

Written By news on Friday, April 22, 2016 | 4/22/2016


సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
 సాక్షి ప్రతినిధి, చెన్నై: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా కమలాపురం లక్ష్మీ శ్రీదేవిరెడ్డిని నియమించినట్లు సేవాదళ్ జాతీయ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. సేవాదళ్ మహిళావిభాగం అధ్యక్షురాలిగా ఉన్న ఆమె అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు సేవాదళ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సైకం రామకృష్ణారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 సేవాదళ్ బలోపేతంపై చర్చ
 తమిళనాడులో వైఎస్‌ఆర్ సీపీ సేవాదళ్ బలోపేతంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తమతో చర్చించినట్లు సేవాదళ్ తమిళనాడు విభాగం ఉపాధ్యక్షులు జకీర్‌హుస్సేన్, ప్రముఖనేత శరవణన్ తెలిపారు. సేవాదళ్ కార్యక్రమాలపై చర్చించేందుకు గురువారం తిరుపతికి వెళ్లి చెవిరెడ్డిని కలుసుకున్నట్లు వారు తెలిపారు. సేవా కార్యక్రమాలతో సేవాదళ్ ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారని అన్నారు. ముఖ్యంగా తమిళనాడులోని

 సేవాదళ్ అధికార ప్రతినిధిగా శ్రీదేవిరెడ్డి
 తెలుగు కుటుంబాలకు సేవాదళ్ కార్యకర్తలు చేరువ కావాలని చెప్పారని తెలిపారు. తమిళనాడు సేవాదళ్ విభాగంలో అనేక మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారని అన్నారు. తమతోపాటు సేవాదళ్ తమిళనాడు నేత ప్రకాష్ సైతం చెవిరెడ్డిని కలిసినట్లు వారు తెలిపారు.

 శ్రీదేవి కృతజ్ఞతలు:
 వైఎస్‌ఆర్ సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధిగా తనను నియమించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలని శ్రీదేవిరెడ్డి చెప్పారు. అలాగే తన పేరును సిఫారసు చేసిన ఉపాధ్యక్షులు జకీర్‌హుస్సేన్, శరవణన్‌లకు ధన్యవాదాలని అన్నారు. 2019 నాటి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించే వరకు అవిశ్రాంతంగా పాటుపడతానని అన్నారు. అధికార ప్రతినిధిగా పార్టీకి వన్నెతెచ్చేట్లుగా వ్యవహరిస్తానని తెలిపారు.
Share this article :

0 comments: