ఢిల్లీ వీధుల్లో పోరాటానికి మేం సిద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీ వీధుల్లో పోరాటానికి మేం సిద్ధం

ఢిల్లీ వీధుల్లో పోరాటానికి మేం సిద్ధం

Written By news on Friday, April 29, 2016 | 4/29/2016


'ఢిల్లీ వీధుల్లో పోరాటానికి మేం సిద్ధం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రమంత్రి ప్రకటనతోనైనా చంద్రబాబు స్పందించాలని అన్నారు. శుక్రవారం ఆయన వైఎస్ ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని చెప్పారు.

విజయవాడ కేంద్రంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్న రాజకీయ వ్యభిచారాన్ని పక్కనపెట్టి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సూచించారు. ప్రత్యేక హోదాపై తాము ఢిల్లీ వీధుల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు లాంటి అసమర్థ సీఎం కారణంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని జోగి రమేష్ విమర్శించారు.
Share this article :

0 comments: