వైఎస్ జగన్‌కి ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌కి ఘన స్వాగతం

వైఎస్ జగన్‌కి ఘన స్వాగతం

Written By news on Tuesday, April 5, 2016 | 4/05/2016


వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
ఓడీ చెరువు/చిలమత్తూరు/గోరంట్ల / కదిరి  :  వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. సోమవారం ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు రోడ్డుమార్గాన వెళ్లారు. మార్గమధ్యంలోని  కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, శెట్టిపల్లి క్రాస్ , గోరంట్ల, ఓడీసీ, కదిరి లో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  చిలమత్తూరు మండలం శెట్టిపల్లి వద్ద హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, గోరంట్ల సమీపంలోని గుమ్మయ్యగారిపల్లి (వైఎస్సార్) సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  ఘన స్వాగతం పలికారు.

ఓడీచెరువు మండల కేంద్రంలో పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  ఇక్కడికి ఓడీసీ, అమడగూరు, నల్లమాడ మండలాల నుంచి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో  వైఎస్ జగన్  కరచాలనం చేశారు.  కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల వద్ద ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాష తదితర నాయకులు జగన్‌కు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు జగన్‌ను కలిశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై సీఎంను కలిసినా ఫలితం లేదన్నారు. జగన్ స్పందిస్తూ చంద్రబాబు ఇప్పుడు ప్రజల గోడు వినే పరిస్థితుల్లో లేరని, సమస్యపై అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుందామన్నారు.
Share this article :

0 comments: