సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడ్డం మాని దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున సవాలు విసిరారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబే వైఎస్సార్‌సీపీని, ప్రతిపక్ష నేతను ఉద్దేశించి దారుణమైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ ప్రతిపక్షాన్నుద్దేశించి ఈ ప్రేలాపనలేమిటని మండిపడ్డారు.
ఎందుకూ పనికిరాని వాళ్లా.. జగన్‌ను విమర్శించేది
భాష రాని మంత్రి అచ్చెన్నాయుడు, ఆలోచన లేని బొండా ఉమామహేశ్వరరావు, కొడుకును రాసలీలలకు ప్రోత్సహించే అనైతిక మంత్రి రావెల కిశోర్‌బాబు, తన కులానికి రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబును ప్రశ్నించలేని కాపు మంత్రి చినరాజప్ప... వీళ్లంతా ఎందుకు పనికిరాని వారని మేరుగ విమర్శించారు. ఇలాంటివారు జగన్‌ను విమర్శించడం ఏమాత్రం తగదన్నారు.

0 comments:
Post a Comment