రోజాకు సుప్రీంకోర్టులో ఊరట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోజాకు సుప్రీంకోర్టులో ఊరట

రోజాకు సుప్రీంకోర్టులో ఊరట

Written By news on Friday, April 22, 2016 | 4/22/2016


రోజాకు సుప్రీంకోర్టులో ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. స్పీకర్ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదికి ఆదేశించింది. రెగ్యులర్ సెషన్స్ లో లేదా ప్రత్యేక సెషన్స్ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మాత్రం తాము మరోసారి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతిచ్చింది. అంతేకాకుండా.. చిన్న సమస్యను పెద్దదిగా చేయవద్దని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సమచారం. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది. 
Share this article :

0 comments: