చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు

చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు

Written By news on Wednesday, April 27, 2016 | 4/27/2016


చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండేళ్లలో 31 స్కాంలకు పాల్పడ్డారని, మొత్తం లక్షా 34 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కుంభకోణాలు, అనైతిక రాజకీయాల గురించి జాతీయ నేతలకు ఫిర్యాదు చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్..  బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి సొమ్ముతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న వైనాన్ని వివరించారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
 
  • పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామని విపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెడుతున్నారు
  • స్పీకర్ ను అడ్డంపెట్టుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు
  • చంద్రబాబు అవినీతిపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరుతో పుస్తకం ముద్రించాం
  • జీవోలతో సహా మొత్తం వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాం
  • రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు
  • నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారు
  • తన అనుచరులు, బినామీలతో రాజధాని ప్రాంతంలో భూములను కొనిపించారు
  • ఆ తర్వాత ఆ ప్రాంతంలో రాజధానిని ప్రకటించారు
  • ఒక్క రాజధాని వ్యవహారంలోనే లక్ష కోట్ల అవినీతి జరిగింది
  • రైతుల భూములున్న ప్రాంతాన్ని అగ్రికల్చర్ జోన్ గా ప్రకటించి.. చంద్రబాబు బినామీల భూములను అర్బన్ ఏరియా కిందకు తీసుకొచ్చారు
  • సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయి
  • చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
  • ఏపీలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు
  • ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలి
  • అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి.. ఎలక్షన్ కమిషన్ కు ఆ బాధ్యత అప్పగించాలి
Share this article :

0 comments: