ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ

Written By news on Friday, April 29, 2016 | 4/29/2016


'ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ'
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలన్నారు. శుక్రవారం మేకపాటి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లులో చంద్రబాబు చాలా బిజీ అయిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని ఎంపీ మేకపాటి ఆరోపించారు.
Share this article :

0 comments: