విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం

విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం

Written By news on Tuesday, May 10, 2016 | 5/10/2016


విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది.  శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయ సాయిరెడ్డి సహా పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరథ్ రెడ్డి, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరంతా ప్రత్యేక హోదాపై ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Share this article :

0 comments: