వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు ధర్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు ధర్నాలు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు ధర్నాలు

Written By news on Monday, May 2, 2016 | 5/02/2016


వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు ధర్నాలు
♦ కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యానికి నిరసన
♦ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు..
♦ ఖాళీ బిందెలతో ప్రదర్శన
♦ గుంటూరు జిల్లా మాచర్లలో పాల్గొననున్న వైఎస్ జగన్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సహాయ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనుంది. అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించాలని పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో  నెలకొన్న దుర్భిక్షస్థితినుంచి ప్రజలను కాపాడడంలో తీవ్రంగా విఫలమైన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం అన్ని మండల కేంద్రాల్లోనూ జరిగే ధర్నాల్లో ఖాళీ బిందెలతో ప్రదర్శన చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా గుంటూరు జిల్లా మాచర్ల మండల కేంద్రంలో జరిగే ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పాల్గొంటారన్నారు. జగన్ ఉదయం 10 గంటలకు మాచర్లకు చేరుకుంటారని వివరించారు. ఆయా జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నేతలు, ఇతర నేతలు తమ తమ నియోజకవర్గాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది
Share this article :

0 comments: