స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

Written By news on Saturday, May 7, 2016 | 5/07/2016


స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే పార్టీ విలీనమైనట్లు కాదు: వైఎస్సార్‌సీపీ తెలంగాణ
సాక్షి, హైద రాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరడాన్ని రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోందని వారు ఒక ప్రకటనలో గుర్తు చేశారు. వందకు వంద శాతం సభ్యులు వేరొక పార్టీలో చేరినా అది రాజ్యాంగ విరుద్ధమేనని స్పష్టం చేశారు. తన నిర్ణయానికి ఉన్న రాజ్యాంగ  బద్ధత ఏమిటో స్పీకర్ వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు తావివ్వడమంటే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గౌరవం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని తాము సవాలు చేస్తామని వెల్లడించారు.
Share this article :

0 comments: