ప్రజాగ్రహాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాగ్రహాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి

ప్రజాగ్రహాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి

Written By news on Tuesday, May 3, 2016 | 5/03/2016


ప్రజాగ్రహాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు, మంచినీటి ఇబ్బందులను పరిష్కరించే విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన ప్రజలను చూశాకైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా సోమవారం తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ధర్నాల్లో వేలాది మంది పాల్గొన్నారని చెప్పారు. ప్రజల గోడు వినలేని, చూడలేని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా.. కరువు, మంచినీటి సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటుందో వివరించాలన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడా రు. చంద్రబాబొస్తేనే కరు వు వస్తుందని ప్రజలు అనుకునే పరిస్థితి రాష్ట్రం లో ఏర్పడిందన్నారు.

 ప్రజలు జగన్‌వైపు చూస్తున్నారు..
 కరువు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేదు కాబట్టే ప్రజలు ప్రతిపక్షం వైపు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు చూస్తున్నారని, సోమవారం నాటి తమ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు లభించిన ప్రజా మద్దతే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువును జాతీయ విపత్తుగా ప్రకటింపజేసేలా ప్రభుత్వం ముందుకు కదలాలని డిమాండ్ చేశారు.

 విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కుట్టి ఒక చిన్నబాబు మరణించాడంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? అని పద్మ మండిపడ్డారు.
Share this article :

0 comments: