
వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి, 10.30 గంటలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు వెళ్తారు. ఇటీవల మట్టిపెళ్లలు విరిగిపడి మరణించిన కూలీల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అలాగే, ఇదే ఘటనలో గాయపడి, గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కూలీని కూడా ఆయన పరామర్శిస్తారు.
0 comments:
Post a Comment