► ఆయన అసమర్థత, చేతగానితనం వల్లే హోదా రావటం లేదు
► 10న జరిగే వైఎస్సార్‌సీపీ ధర్నాను విజయవంతం చేయాలి
► సమావేశంలో పెద్దిరెడ్డి, పార్థసారథి
► 10న జరిగే వైఎస్సార్‌సీపీ ధర్నాను విజయవంతం చేయాలి
► సమావేశంలో పెద్దిరెడ్డి, పార్థసారథి
విజయవాడ (గాంధీనగర్) : చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ కుట్రపూరిత ఆలోచనా విధానం బట్టబయలైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధించడంలో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నాయకుల సమావేశం ఆదివారం జరిగింది.
హోదాపై స్పందించకుండా.. విదేశాలకా!
సమావేశం అనంతరం పార్టీ జిల్లా పరిశీలకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పినప్పటికీ దానిపై స్పందించకుండా చంద్రబాబు విహారయాత్రలకు విదేశాలు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ‘మా మంత్రులు రాజీనామా చేయరు. కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించం. ప్రత్యేక హోదా, బీజేపీతో పొత్తు విషయంలో గానీ మాట్లాడవద్దు’ అంటూ ఆ పార్టీ నాయకులకు సీఎం చంద్రబాబు సూచించడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. ‘మాకు మొట్టమొదటే తెలుసు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, చంద్రబాబు కూడా తెలుసు.. ఆయన చతురుడు కాబట్టి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చాడు..’ అంటూ సాక్షాత్తూ తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుకు ముందే తెలిస్తే.. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదనుకుంటోందా అని వారు ప్రశ్నించారు.

చంద్రబాబు తన అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపరచలేదని, అందుకే రాలేదని చెబుతున్నారని, అది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని మోసపుచ్చేందుకే అటువంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలన్నింటికీ ఎక్కడా ప్రత్యేకంగా చట్టం చేసి ప్రత్యేక హోదా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, కేంద్ర కేబినెట్ నిర్ణయం ద్వారానే ప్రత్యేక హోదా పొందారన్నారు.
చూస్తూ కూర్చుంటారా?
ప్రతిపక్షాలు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా అని వారు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామికంగా రాజకీయపక్షాలన్నింటినీ కలుపుకొని పోవాలని, వైఎస్సార్‌సీపీ చేసే పోరాటానికి సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలకు తెగించి పోరాడేది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. ఈ నెల 10న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆరోజు ఉదయం 10 గంటలకు కంట్రోల్ రూం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన, ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, కల్పన, మేకా ప్రతాప్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, సామినేని ఉదయభాను, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, అధికార ప్రతినిధి జోగి రమేష్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు

0 comments:
Post a Comment