ఏ సాధించారని..మహానాడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ సాధించారని..మహానాడు!

ఏ సాధించారని..మహానాడు!

Written By news on Thursday, May 26, 2016 | 5/26/2016


ఏ సాధించారని..మహానాడు!
రెండేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి


 ఇనుకుర్తి (పొదలకూరు) :
  రెండేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం, జిల్లాలో అభివృద్ధి శూన్యమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. పొదలకూరు మండలం ఇనుకుర్తిలో రూ.15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ ఏం సాధించారని టీడీపీ నేతలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మినీ మహా నాడు, మహానాడులను నిర్వహిస్తున్నారని ప్రశ్నిం చారు. ఈ రెండేళ్ల పాలనలో దోచుకుని దాచుకున్న ధనంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్ప అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఖాళీ అవుతుందని మాట్లాడే టీడీపీ నాయకులకు ఆ పార్టీ మట్టిలో కలిసే రోజును చూడాల్సి వస్తుందన్నారు. మహానాడు సభల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తప్పించి అభివృద్ధి పనులపై చర్చించిన దాఖలాలు లేవన్నారు.

అభివృద్ధి ముసుగులో దోచుకునేందుకు ప్రయత్నిస్తే పోరాడుతానని హెచ్చరించారు. తాను కష్టపడి కండలేరు ఎత్తిపోతల పథకం, సంగం-పొదలకూరు డబుల్‌రోడ్డు పనులను మంజూరు చేయిస్తే ఆ పనుల్లో దోచుకు తినేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆర్‌అండ్‌బీలో దాఖలు చేసిన టెండర్లను ఖరారు కాకుండా అడ్డుకుంటే తాను ఉద్యమించి టెండర్లను ఖరారు చేయించానని చెప్పారు. అయినా కొన్ని పనుల్లో పర్సంటేజీలు పొందినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. తెలుగుగంగ సాగునీటిని వైఎస్సార్‌సీపీ పటిష్టంగా ఉన్న గ్రామాలకు అందకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యమిస్తానన్నారు. ఇనుకుర్తిలో రూ.45 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.

ఎమ్మెల్యేలకు నిధులను ఇవ్వకున్నా.. కేంద్రం నుంచి అందే 13, 14 ఆర్థిక సంఘం నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ అక్కెం రాఘవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ సర్పంచ్ పెదమల్లు నారాయణరెడ్డి, పార్టీ నాయకులు కుడుముల వెంకటేశ్వరరెడ్డి, పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఎనిమిరెడ్డి పెంచలరెడ్డి, వెంకురెడ్డి, మస్తానయ్య, రమణమయ్య, ఎంపీడీఓ శ్రీహరి, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు చంద్రశేఖర్, కే.కసనానాయక్, ఆర్‌ఐ హజరత్‌బాబు ఉన్నారు.
Share this article :

0 comments: