నేడు బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి

నేడు బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి

Written By news on Wednesday, May 4, 2016 | 5/04/2016


నేడు బ్రాండెక్స్ కార్మికులతో  వైఎస్ జగన్ ముఖాముఖి
బొత్స సత్యనారాయణ వెల్లడి

 మునగపాక: మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎస్‌ఈజెడ్‌లు తీసుకువస్తే నేటి ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా చాకిరీ చేయించడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండలం నాగవరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బ్రాండెక్స్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమని, కార్మికులకు న్యాయం జరిగేలా తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం బ్రాండెక్స్ కార్మికులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కార్మికులతో మాట్లాడేందుకు వస్తుంటే 144 సెక్షన్ అమలులో ఉందంటూ పోలీసు అధికారులు కుంటి సాకులు చెప్పడం తగదన్నారు. నిబంధనల పేరుతో వైఎస్ జగన్ సభకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Share this article :

0 comments: