చంద్రబాబు, కరువు కవల పిల్లలు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు, కరువు కవల పిల్లలు...

చంద్రబాబు, కరువు కవల పిల్లలు...

Written By news on Monday, May 2, 2016 | 5/02/2016


చంద్రబాబు, కరువు కవల పిల్లలు...
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా అన్నారు. కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సోమవారం వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాటలో భాగంగా తిరుపతి ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..చంద్రబాబు, కరువు కవల పిల్లలని...బాబు ఎప్పుడు సీఎం అయినా కరువు వస్తుందని దుయ్యబెట్టారు. చంద్రబాబుకు కరువుపై ముందు చూపు లేదని...ఉన్నదంతా మొండిచూపేనన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న ప్రజలను గాలికి వదిలేసి.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న మజ్జిగ కేంద్రాల హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రోజా చెప్పారు.
Share this article :

0 comments: