ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ మరోసారి పోరుబాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ మరోసారి పోరుబాట

ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ మరోసారి పోరుబాట

Written By news on Thursday, May 5, 2016 | 5/05/2016


ప్రత్యేక హోదాపై వైఎస్సార్ సీపీ మరోసారి పోరుబాట
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పోరుబాట పట్టనుంది.  ప్రత్యేక హోదా నిబంధనేదీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేదని కేంద్రం స్పష్టం చేయటంతో ప్రతిపక్ష పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన తాము చాటి చెబుతామన్నారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం ప్రకటన రాష్ట్రానికి చెంపపెట్టులాంటిదని, ఇప్పటికైనా టీడీపీ తన వైఖరోంటే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఓ మాట...రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా ముఖ్యమా? వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ఆర్థిక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందనటం చాలా దురదృష్టకరమన్నారు. సీఎంకు ప్రాంతీయ అవసరాలు, అభివృద్ధి పట్టదని బొత్స ధ్వజమెత్తారు.
కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారని, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను చూసి అయినా చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. కేంద్రం దిగి వచ్చేలా అందరం కలిసి సకలం బంద్ చేద్దామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: