సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ

సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ

Written By news on Friday, May 13, 2016 | 5/13/2016


సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ సీపీ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలను పిటిషన్ లో ప్రతివాదులు చేర్చింది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో వైఎస్సార్ సీపీ పేర్కొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. 

స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వైఎస్సార్ సీపీ లోక్‌ సభ పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: