మా దగ్గర ఆధారాలున్నాయి.. బయటపెడతాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా దగ్గర ఆధారాలున్నాయి.. బయటపెడతాం

మా దగ్గర ఆధారాలున్నాయి.. బయటపెడతాం

Written By news on Monday, May 30, 2016 | 5/30/2016


హైదరాబాద్: 'ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనాపాటి' అని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను పోటీలో పెట్టి.. వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేలను రూ. 40 కోట్లతో కొనడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు... విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బు వెదజల్లుతున్నారని ఆర్కే మండిపడ్డారు. 

తమ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కొనుగోలుకే రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయనీ, వాటిని సరైన సమయంలో బయటపెడతామని తెలిపారు. ఎమ్మెల్యేలను కొనగలరేమో గానీ, ప్రజలను కొనలేరని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
Share this article :

0 comments: