చంద్రబాబు డబ్బున్నోళ్లనే ఎంపిక చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు డబ్బున్నోళ్లనే ఎంపిక చేశారు

చంద్రబాబు డబ్బున్నోళ్లనే ఎంపిక చేశారు

Written By news on Tuesday, May 31, 2016 | 5/31/2016


చంద్రబాబు డబ్బున్నోళ్లనే ఎంపిక చేశారు
హైదరాబాద్: తమ పార్టీ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే, టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బున్నవారిని ఎంపిక చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన విజయసాయి రెడ్డి ఉన్నత విద్యావంతుడని అన్నారు. 

చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలు పట్టవని బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు ధనార్జనే ముఖ్యమని, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు నయవంచనకు నిరసనగా జూన్ 2వ తేదీన వైఎస్ఆర్ సీపీ నిర్వహించతలపెట్టిన ఆందోళలను అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. ఆ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి, ప్రభుత్వ తీరుపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని బొత్స తెలిపారు
Share this article :

0 comments: