అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

Written By news on Monday, May 30, 2016 | 5/30/2016


అనంపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అధికార తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారు. జిల్లాలోని మామిళ్లపల్లి వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు రాడ్లు, కత్తులతో దాడులు చేశారు. తీవ్రంగా గాయపడ్డ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు అక్కడకు కూడా చేరుకొని మరో మారు ఘర్షణకు దిగారు.

దీంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడుల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కార్యకర్తలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు జరుపుతున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
Share this article :

0 comments: