అయితే దీనిపై కలిసిపోరాడుదాం రండి కాంట్రాక్టులు కూడా పోతాయ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అయితే దీనిపై కలిసిపోరాడుదాం రండి కాంట్రాక్టులు కూడా పోతాయ్

అయితే దీనిపై కలిసిపోరాడుదాం రండి కాంట్రాక్టులు కూడా పోతాయ్

Written By news on Friday, May 13, 2016 | 5/13/2016


బహిరంగ చర్చకు రండి: అంబటి సవాల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు తమను ప్రత్యేక హోదా కోరనే లేదని, ఆయన చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాని భారతీయ జనతాపార్టీ నేతలు వ్యాఖ్యానించిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగటానికి సిగ్గనిపించడం లేదా అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలు రాష్ట్రానికి 1,43,000 కోట్ల రూపాయలను కెటాయించినట్లు వెల్లడిచారని.. అయితే ఈ డబ్బును ఎలా ఖర్చు చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి కాకుండా ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగారని, ఆ తరువాత మాటమార్చారని ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు.

ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం కృషి చేయక పోగా ఆ విషయంలో పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు.. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల్లో వైఎస్ జగన్ కు కాంట్రాక్టులు దక్కించుకున్నారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారనీ.. అయితే దీనిపై కలిసిపోరాడుదాం రండి కాంట్రాక్టులు కూడా పోతాయ్ అంటూ చురకలంటించారు.

చంద్రబాబు తాబేదార్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, మంత్రి సుజనా చౌదరి బ్యాంకుకు పంగనామాలు పెట్టడానికి చూస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పక్కరాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం మీద బహిరంగ చర్చకు రావాలని అంబటి సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో చంద్రబాబుకు న్యాయస్థానాలు సరైన సమాధానం చెబుతాయన్నారు.
Share this article :

0 comments: