
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా బయల్దేరారు. మాచర్లలో జరిగే ధర్నాలో ఆయన పాల్గొననున్నారు. కాగా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా సహాయ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనుంది.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మాచర్ల మండల కేంద్రంలో జరిగే ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించాలని పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment