కేంద్ర ప్రభుత్వమంటే భయమెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్ర ప్రభుత్వమంటే భయమెందుకు?

కేంద్ర ప్రభుత్వమంటే భయమెందుకు?

Written By news on Thursday, May 26, 2016 | 5/26/2016


కేంద్ర ప్రభుత్వమంటే భయమెందుకు?
చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

కోట : కేంద్ర ప్రభుత్వమంటే సీఎం చంద్రబాబునాయుడుకి ఎందుకంత భయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశ్నించారు. బాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం కోటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా, తెలంగాణా అక్రమ ప్రాజెక్టుల విషయాల్లో ప్రధాని మోదీతో,  సీఎం కేసీఆర్‌తో బాబు రాజీ ధోరణి అవలంబిస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే రాష్ట్రానికి హోదా రాకుండా ఆయనే అడ్డుపడుతున్నారేమోననే అనుమానం కలుగుతోందన్నారు.రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నారు. ప్రధాని కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పసిగట్టి చంద్రబాబును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. హోదా సాధించడం చంద్రబాబుకు చేత కాకుంటే తప్పుకోవాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అందరినీ కలుపుకొని హోదా కోసం పోరాడుతుందన్నారు. ప్రత్యేక హోదా, తెలంగాణా అక్రమ ప్రాజెక్టులు ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందుకు వైఎస్సార్‌సీపీ మద్దుతు ఇస్తుందన్నారు.


 వాటి వెనుక బాబు హస్తం..
 బీజేపీపై తెలుగు తమ్ముళ్ల విమర్శల వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని ప్రసన్న ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత  ఆ పార్టీపై విమర్శలు చేయిస్తూ డ్రామాలాడుతున్నాడన్నారు. మినీ మహానాడులు కుమ్ములాటలకు వేదికగా మారాయన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్టీలకు, మైనార్టీలకు ప్రాధాన్యత లేదన్నారు. వారంటే ఎందుకు చిన్నచూపో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరిచలపతి, సర్పంచ్ రాఘవయ్య, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, ప్రసాద్, ఉపసర్పంచ్ ఇంతియాజ్ పాల్గొన్నారు
Share this article :

0 comments: