చెన్నమనేని మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెన్నమనేని మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

చెన్నమనేని మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

Written By news on Monday, May 9, 2016 | 5/09/2016


చెన్నమనేని మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ :  ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,  సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నమనేనీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.విలువలకు కట్టుబడిన వ్యక్తి చెన్నమనేని అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
చెన్నమనేని రాజేశ్వరరావు(93) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అలాగే  చెన్నమనేని మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. చెన్నమనేని అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.
Share this article :

0 comments: