
తిరుపతి (మంగళం): ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నే త వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి మరిం త శక్తిని ప్రసాదించు గంగమ్మ తల్లి అంటూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వేడుకున్నా రు. గురువారం తాతయ్యగుంట గం గమ్మను ఆయన దర్శించుకుని, ప్రత్యే క పూజలు చేయించారు. ఆలయ చైర్మన్ సుబ్రమణ్యం ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అయితే ఆంధ్ర రాష్ట్రానికి చుక్క నీళ్లు రావని జగనన్న మూడు రోజులు జలదీక్ష చేశారన్నారు.
దీనికి లక్షలాది మంది రైతులు, ప్రజలు మద్దతు తెలపడం సంతోషిం చదగ్గ విషయమన్నారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందని తెలిసినా సీఎం చంద్రబాబు నోరుమెదపడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయనకు సొంతలాభాలే ముఖ్యమని విమర్శించారు. ప్రత్యేక హోదాపైకేంద్రాన్ని ఎదురించే ధైర్యం లేక చేతగాని సీఎంగా నిలుస్తున్నారని విమర్శించారు.
0 comments:
Post a Comment