► నిర్వాసితుల ఆగ్రహం
► ఇబ్రహీంపట్నం, ఫెర్రీలలో ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత
► బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
ఇబ్రహీంపట్నం : ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి పేరుచెప్పి రోడ్డున పడేస్తారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలోని సుందరయ్యనగర్, ఫెర్రీ రహదారిలో పేదల నివాసాలను బుధవారం ఉదయం తొలగించేందుకు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ జి.రామకృష్ణ, స్థానిక సీఐ డి.చవాన్ నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు. తహసీల్దార్ జయశ్రీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పొక్లెయిన్లతో నివాసాలు కూల్చేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు ఏకమై ఉన్నపళంగా మా గూడులు కూల్చేస్తే మేమెక్కడికి వెళ్లాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రత్యామ్నాయం చూపనిదే ఈ ప్రాంతాన్ని వీడేదిలేదని స్పష్టంచేశారు.
బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ
విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ బాధితులకు అండగా నిలిచారు. సుందరయ్యనగర్‌లో రెవెన్యూ, పోలీస్ అధికారులతో చ ర్చించారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను ఒక్కసారిగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయం చూపిన తరువాతే ఇళ్లు తొలగించాలని వత్సవాయి తహసీల్దార్ శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దార్ జయశ్రీని కోరారు. బాధితుల ఇంటింటికి వెళ్లి ప్రత్యామ్నాయ స్థలాలు వచ్చే వరకు పోరాడతామని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
పోరాడి సాధించిన నివేశన స్థలం పట్టాలు
బాధితులకు ప్రత్యామ్నాయంగా నివేశన స్థలం పట్టాలు ఇవ్వనిదే నివాసాలు ఖాళీచేసే ప్రసక్తే లేదని జోగి రమేష్ స్పష్టంచేశారు. స్థలాలు ఇచ్చే వరకు ఇక్కడే ఉంటారని చెప్పారు. దీనిపై సబ్ కలెక్టర్ సృజనతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కనీసం అద్దెలు కూడా కట్టుకునే పరిస్థితి వీరికి లేదని వివరించారు. పట్టాలు ఇవ్వనిదే నిర్వాసితులు ఇక్కడి నుండి కదలరని చెప్పారు. దీంతో బాధితులకు తక్షణమే నివేశనస్థం పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ జయశ్రీకి సబ్‌కలెక్టర్ సూచించారు. ఆమె సూచనల మేరకు రెవెన్యూ అధికారులు సుందరయ్యనగర్‌లో, ఫెర్రిలో బాధితులకు పట్టాలను పంపిణీ చేశారు. అప్పటి వరకు దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండతో పట్టాలు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి లంకే అంకమోహనరావు, ఎంపీటీసీ సభ్యురాలు లంకే దేవకుమారి, వార్డు సభ్యులు రాయిపూడి వెంకటరావు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment