కాపు భవనాలకు బాబు పేరా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాపు భవనాలకు బాబు పేరా!

కాపు భవనాలకు బాబు పేరా!

Written By news on Friday, May 20, 2016 | 5/20/2016


కాపు భవనాలకు బాబు పేరా!
♦ మండిపడిన వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు
♦ సావిత్రి, సీకే నాయుడులాంటి కాపు ప్రముఖుల పేర్లెందుకు పెట్టరు?
♦ కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ వారిని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాపుల కోసం నిర్మించే భవనాలకు ‘చంద్రన్న కాపు భవనాలు’ అని పేరు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల్లో జాతీయ స్థాయిలోనే పహిల్వాన్‌గా ఖ్యాతి గడించిన కోడి రామ్మూర్తినాయుడు, జాతీయోద్యమంలో పోరాడిన కన్నెగంటి హనుమంతు,ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడైన ఎస్వీ రంగారావు, భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు, మహానటి సావిత్రి వంటి ఎందరెందరో ప్రముఖులుంటే వారి పేర్లను కాదని కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏమిటని ధ్వజమెత్తారు.
ఈ భవనాలను చంద్రబాబు నారావారిపల్లిలోని తన ఆస్తిలో నుంచి తీసి కట్టించడం లేదని ప్రభుత్వ సొమ్ముతో కాపుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న ఈ భవనాలకు ఆయన పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం జారీ చేసి జీవో నెంబరు 16లో ఈ భవనాలతో పాటుగా అనేక పథకాలను చంద్రన్న పేరుతో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
 కాపులపై చిత్తశుద్ధి లేదు
కాపులకు రిజర్వేషన్లు ఇస్తాననీ హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని అంబటి విమర్శించారు.  కాపుల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ జలదీక్షపై భూమా నాగిరెడ్డి చేసిన విమర్శలను ప్రస్తావించగా... ఆయనకు సిగ్గుంటే ముందు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి  మాట్లాడాలన్నారు.
Share this article :

0 comments: