కేసీఆర్ హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్ హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదు

కేసీఆర్ హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదు

Written By news on Monday, May 16, 2016 | 5/16/2016


కేసీఆర్ హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదు
► నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమో
► అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడుతున్నారు
► కింది రాష్ట్రాలు ఎడారి అయిపోయినా మీకు పట్టదా
► వీటి గురించి పట్టించుకునే నాథుడు లేడా
► ప్రశ్నించాలన్న జ్ఞానం చంద్రబాబుకు లేదా
► జలదీక్ష ప్రారంభ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కర్నూలు

తమ అవసరాలు తీరిన తర్వాతే కిందకు నీళ్లు పంపుతామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హిట్లర్‌లా మాట్లాడటం భావ్యం కాదని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనని భయపడుతున్నానన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు ఏమాత్రం మాట్లాడకపోవడానికి నిరసనగా కర్నూలులో మూడు రోజుల జలదీక్షను సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
 • 12 గంటలైందన్న సంగతి నాకుతెలుసు, ఎండలు తీక్షణంగా ఉన్నాయనీ తెలుసు
 • అయినా మండుటెండను సైతం లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆత్మీయతను చూపిస్తున్నారు
 • కష్టమనిపించినా, ఇక్కడికొచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా
 • మనం ఈవాళ దీక్షా కార్యక్రమాన్ని చేస్తూ ఇన్ని వేల మంది ఇక్కడ ఏకమయ్యాం
 • రాష్ట్రవ్యాప్తంగా కొన్నికోట్ల గుండెలు మనకు ఆశీస్సులు ఇస్తున్నాయి
 • ఏం జరుగుతోంది, ఎందుకు మనం దీక్షలు చేస్తున్నాం, రాష్ట్రంలో పరిస్థితులేంటని గమనిస్తే.. ఒక్కటి అర్థమవుతుంది
 • దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అవుతోంది.. అటు తెలంగాణ ప్రభుత్వం మన కళ్లెదుటే, మనకు నీళ్లు రావని తెలిసి కూడా అన్యాయం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా, వాళ్ల ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతూ పోతున్నారు.
 • ఇటు కృష్ణా, అటు గోదావరిపై ప్రాజెక్టులు కడుతూ పోతున్నారు, కిందకు నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా వీళ్లకు తట్టడం లేదు.
 • ఒకటే అడుగుతున్నా.. కేసీఆర్‌ గారిని అడుగుతున్నా.. ఇలా అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతూ పోతే కిందకు నీళ్లు ఎలా వస్తాయని నిలదీసి అడగలేకపోతున్నారేమని చంద్రబాబును అడుగుతున్నా
 • మేం ఎలా బతకాలన్న ఆలోచన మీకు ఉందా అని అడుగుతున్నా
 • కృష్ణా, గోదావరి.. ఈ రెండు నదులపై ఏం జరుగుతోందో గమనిద్దాం
 • కృష్ణానదిలో దాదాపు 1750 టీఎంసీల నీళ్లు లైవ్ స్టోరేజి నిల్వ చేసే సామర్థ్యంతో ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అనధికారికంగా మరో 2-300 టీఎంసీలు స్టోర్ చేస్తున్నారు
 • ఇందులో దాదాపు 1300 టీఎంసీలకు సరిపడ కర్ణాటక, మహారాష్ట్ర డ్యాములు కట్టాయి
 • కృష్ణానదిలో మహారాష్ట్ర వాళ్ల అవసరాలు తీరాక, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా వదలట్లేదు
 • మధ్యలో ఇప్పుడు శ్రీశైలానికి నీళ్లు రాకముందే మహబూబ్‌నగర్‌లోనే తెలంగాణ ప్రభుత్వం 120 టీఎంసీల నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకెళ్లిపోతే శ్రీశైలానికి నీళ్లెలా వస్తాయని కేసీఆర్, చంద్రబాబులను అడుగుతున్నా
 • రోజుకు 2 టీఎంసీల నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకెళ్లేలా పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులు కడుతున్నారు
 • కల్వకుర్తి ప్రాజెక్టు ఇంతకుముందు 25 టీఎంసీలుంటే 40 టీఎంసీలకు పెంచారు. దానికోసం మరో .66 టీఎంసీల నీళ్లు పైకి తీసుకెళ్తున్నారు.
 • కేసీఆర్, చంద్రబాబు.. అయ్యా, మీరు 2.66 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నారు. అంటే, దాదాపు 30వేల క్యూసెక్కుల నీరు ప్రతిరోజూ తీసుకెళ్లిపోతున్నారు.. ఇది ధర్మమేనా?
 • శ్రీశైలంలో 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీళ్లు అందించే పరిస్థితి లేదు
 • అలాంటిది 800 అడుగుల్లోనే ఇన్‌టేక్ పాయింట్ పెట్టి, తెలంగాణలో ఆ పాయింట్ పెట్టుకుని, శ్రీశైలానికి నీళ్లు రాకుండా ఎడాపెడా నీళ్లు తోడేసుకుంటే మాకు తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అని కేసీఆర్, చంద్రబాబులను అడుగుతున్నా
 • శ్రీశైలంలో అవసరాలు తీరిన తర్వాత సాగర్‌కు, ఆ తర్వాతే కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి
 • ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేస్తున్నా, అడిగే నాథుడు లేడు, చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు
 • శ్రీశైలం ప్రాజెక్టులో ఎప్పుడూ కనీసం 854 అడుగుల నీళ్లుండాలని 1960లోనే ప్రాజెక్టు డిజైన్‌లో ఉంచారు.
 • దానికి అనుకూలంగానే అంజయ్యగారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు శంకుస్థాపన చేసి, కట్టారు
 • తర్వాత మన ఖర్మ కొద్దీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆయన మొదటిసారిగా ఈ డ్రా డౌన్ లెవెల్‌ను ఒక జీవో ద్వారా తగ్గించారు
 • ఆ తర్వాత రాజశేఖరరెడ్డి వచ్చి, ఆ అన్యాయాన్ని సరిదిద్దుతూ జీవో నెం. 107 ఇచ్చారు. మళ్లీ 854 అడుగుల మట్టం తగ్గకూడదన్నారు
 • తాగడానికి మరీ ఇబ్బంది వస్తే మాత్రం కాస్తో కూస్తో తగ్గినా పర్వాలేదని చెప్పారు
 • రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగులు ఉండక తప్పదు
 • అంత ఉన్నా కూడా పూర్తిగా నీళ్లివ్వలేమని అందరికీ తెలుసు
 • అయినా చంద్రబాబు సీఎంగా ఉండి, మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ టెండర్లు పిలిచి, 800 అడుగులకే ఇన్‌టేక్ పాయింట్ పెడుతున్నారు
 • ఇక శ్రీశైలంలోకి నీళ్లు ఎలా వస్తాయి, తర్వాత సాగర్ పరిస్థితేంటి, కృష్ణా డెల్టా ఎడారి అయిపోదా అని చంద్రబాబు అడగలేకపోతున్నారు
 • వాళ్లిద్దరినీ ఒక్కటే అడుగుతున్నా.. మీరు మీ స్వార్థం కోసం 5 కోట్ల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
 • మీరు కడుతున్న ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా ఎలా కట్టగలరని ప్రశ్నిస్తున్నా
 • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా ఒకసారి చూడాలి
 • వీళ్లిద్దరూ చెబుతున్న ప్రాజెక్టులేవీ షెడ్యూలు 9లో కనిపించవు
 • హంద్రీ నీవా, తెలుగు గంగ, గాలేరు- నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు మాత్రం కనిపిస్తాయి
 • వీటికి మాత్రమే నీళ్ల కేటాయింపులు జరుగుతాయని చెప్పారు
 • మరి పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఎక్కడ పెట్టారని అడుగుతున్నా
 • ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 84 ప్రకారం నిబంధనలున్నాయి
 • ముందుగా సీడబ్ల్యుసీ అనుమతి, నీటి యాజమాన్య బోర్డుల అనుమతి తీసుకోవాలని, తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు
 • మరి నీటి యాజమాన్య బోర్డులు మీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాయా.. లేదు. అయినా ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతున్నారు
 • ఎప్పుడో 2013లో ఫీజిబులిటీ నివేదిక తయారు చేయమన్న చిన్న మాటను పట్టుకుని, అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కట్టడంపై చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు?
 • కృష్ణానది విషయంలో ఇంతటి భయానక పరిస్థితులున్నాయి
 • 2015లో మనకు చుక్కనీరు కూడా అందలేదు. 2014లో ఇదే చంద్రబాబుతో కలిసి ఆ ఒక్క సంవత్సరానికి సంబంధించి నీళ్ల పంపకంపై ఒక సమావేశం పెట్టుకున్నారు
 • 299 టీఎంసీల నీళ్లు వాళ్లు వాడుకోడానికి చంద్రబాబు అప్పుడు ఆమోదం తెలిపారు
 • అది చంద్రబాబు చేసిన తప్పే.. కానీ అది కేవలం ఒక్క ఏడాదికేనన్న విషయం మర్చిపోకూడదని కేసీఆర్‌కు చెబుతున్నా
 • ఇక గోదావరి పరిస్థితి కూడా అంతే. మనకున్నది రెండే రెండు నదులు.
 • ఈ రెండూ తెలంగాణలోంచి ప్రయాణించి, ఆంధ్ర రాష్ట్రానికి రావాలి
 • ఇదే గోదావరి మీద కూడా కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నారు
 • కాళేశ్వరం ఎత్తిపోతల, దేవాదుల ఎత్తిపోతుల, తుపాకుల గూడెం ఎత్తిపోతల, సీతారాంపూర్ ఎత్తిపోతల, భక్తరామదాసు ఎత్తిపోతలతో నీళ్లు ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నిలదీయడం లేదు
 • గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు కాస్తో కూస్తో వరదలుంటాయి. ఆ తర్వాత నుంచి ఆ నదిలో ఉన్నవి కేవలం 1539 క్యూసెక్కుల నీళ్లే.
 • కేసీఆర్‌ గారు నీళ్లు ఎత్తుకపోతే కిందకు వచ్చేది ఏమీ ఉండదు
 • 36వేల క్యూసెక్కులు అక్కడ అవసరం అవుతాయి
 • గోదావరి మీద, కృష్ణామీద ఆయన ప్రాజెక్టులు కడుతుంటే, కనీసం అడిగే నాథుడు కూడా లేకపోతే బాధ వేస్తుంది
 • రాష్ట్రం కలిసున్నప్పుడు తెలుగువాళ్లు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలని కర్ణాటక, మహారాష్ట్రపై ఒక్కటిగా పోరాడేవాళ్లం
 • రాష్ట్రం విడిపోయాక తెలుగువారు అని కూడా చూడకుండా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
 • హైదరాబాద్ నగరాన్ని అప్పుడు వాళ్లు పట్టుబట్టి తీసుకెళ్లిపోయారు
 • ఎక్కడున్నా ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు. కానీ ఆ మంచి ఎలా చేస్తున్నారో చూడాలి
 • కింది రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేకపోతే అక్కడి ప్రజల ఉసురు తగలదా అని కేసీఆర్‌ను అడుగుతున్నా
 • మీరు చేస్తున్నది తప్పు.. దాన్ని సరిచేసుకోవాలి. అందరం కలిసి నీళ్ల కోసం పోరాడుదాం
 • మీరు మమ్మల్ని రోడ్డుమీద పారేయడం అన్యాయమని చెబుతున్నా
 • 2011లోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద 26 మంది ఎమ్మెల్యేలతో ధర్నా చేశాం
 • మహారాష్ట్ర నుంచి ఆంద్ర రాష్ట్రం చివరి వరకు ప్రతి బొట్టు కూడా మా వాటా మాకు, వాళ్ల వాటా వాళ్లకు ఇవ్వండని చెప్పాను
 • అందరం ఒక్కటై ఈ వ్యవస్థలో మార్పును తీసుకురావాలి.. ప్రతి నీటి బొట్టు కూడా ఎవరి వాటా వాళ్లకు రావాలి
 • 15 రోజులకు ఒకసారి వాటాల సర్దుబాటు జరగాలి.
 • అలా చేయకుండా మా దగ్గర నుంచి నీళ్లొస్తాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లు అడ్డుపడితే ఎలా
 • ఇది ఇండియా - పాకిస్థాన్ మధ్య గొడవలా అయిపోదా అని అడుగుతున్నా
 • గోదావరి నది నుంచి కూడా నీళ్లను కేసీఆర్ తీసుకుపోతున్నారు
 • ఎవడబ్బ సొమ్మని నీళ్లు తీసుకుపోతున్నారు.. 954 టీఎంసీలు తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారు?
 • మిగిలినవి మాత్రమే పంపుతామని కేసీఆర్ మాట్లాడుతున్న తీరు ధర్మమేనా అని అడుగుతున్నా
 • తెలంగాణలో మీ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతనేది రెండు నదుల విషయంలో తేలలేదు
 • కేవలం మీ అవసరాలు తీరిన తర్వాతే మాకు నీళ్లు పంపుతామంటూ హిట్లర్ మాదిరిగా మాట్లాడటం భావ్యం కాదు
 • ఇక్కడ జరుగుతున్న అన్యాయం మన రాష్ట్రంలోని వాళ్లకే కాదు, దేశంలోని నాయకులందరికీ తెలియాలి
 • కేసీఆర్‌కు, చంద్రబాబుకు కూడా జ్ఞానోదయం కావాలని నాలుగు అడుగులు ముందుకు వేద్దాం
 • పాలకులు మార్గనిర్దేశకులుగా ఉండాలి, ప్రజల బాగోగులు చూడటం మన ధర్మమని చెబుతున్నా
 • అదే ఆంధ్ర ప్రదేశ్ పైన ఉండి, తెలంగాణ కింద ఉండి, మేం మీలా చేస్తే మీకు నచ్చేదా అని ప్రశ్నిస్తున్నా
 • కేసీఆర్ పాలన చూస్తుంటే.. బ్రహ్మం గారు చెప్పినట్లు నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయా అని భయం వేస్తోంది
Share this article :

0 comments: