టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం!

టీ-20 మ్యాచ్‌లో దేశాలు దాటిన అభిమానం!

Written By news on Sunday, June 19, 2016 | 6/19/2016


హరారే: భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సందడి చేశారు. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో వైఎస్ఆర్‌సీపీ జెండాలు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తమ టీ షర్ట్‌లపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, యువనేత జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రాలను ధరించి తమ మద్దతు ప్రకటించారు. టీ-20 క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా దేశాలు దాటిన అభిమానాన్ని చాటుకుంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హల్‌చల్ చేశారు. తాము విదేశాల్లో ఉన్నా.. తమకు వైఎస్‌ఆర్‌సీపీపై ఎనలేని అభిమానముందని చాటుకున్నారు.