సీబీఐతో విచారణ చేయించి, జైల్లో పెట్టిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐతో విచారణ చేయించి, జైల్లో పెట్టిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు

సీబీఐతో విచారణ చేయించి, జైల్లో పెట్టిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు

Written By news on Sunday, June 5, 2016 | 6/05/2016

 కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఏదైనా సాధిస్తారనుకుంటే అదీ లేదు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీకి ఎలాంటి అల్టిమేటం ఇవ్వలేదు. అల్టిమేటం ఇస్తే రెండేళ్ల పాలనలో అక్రమాలపై నరేంద్రమోదీ సీబీఐతో విచారణ చేయించి, జైల్లో పెట్టిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు
చంద్రబాబు ఏకంగా రాష్ట్రాన్నే మోసగించారు
‘అనంత’రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
 ‘‘గ్రామాల్లో మనల్ని ఎవరైనా మోసగిస్తే.. మనం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై 420 కేసు పెడతారు. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల  సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, విద్యార్థులు... ఇలా ఏకంగా రాష్ట్రాన్నే మోసం చేశారు. అలాంటప్పుడు ఆయనపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి? మోసం చేసినవాడిని చెప్పుతో కొట్టాలని రాయలసీమలో అంటాం.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఏం చేయాలి? మనం కలిసికట్టుగా ఒక్కటై.. మోసం చేసిన చంద్రబాబుకు ఎప్పుడు చెప్పులు చూపించడం మొదలుపెడతామో అప్పుడు ఆయన మనసు మారుతుంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు శనివారం ఆయన కదిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్‌పీ కుంటలో సోలార్ ప్లాంట్ భూ నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. తలుపుల మండలం కుర్లిరెడ్డివారిపల్లెలో ఆత్మహత్య చేసుకున్న రైతు చంద్రశేఖర్  కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కదిరిలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
 బలవన్మరణాలకు కారణం ఎవరు?
‘‘అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 80 మంది కుటుంబాల వద్దకు వెళ్లాం. వీరిలో దాదాపు 15 మంది చేనేత కార్మికులు, మిగిలిన వారు రైతులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో బలవన్మరణాలకు కారణం ఎవరు? ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్యాంకుల్లో కుదువపెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా... రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు. బాబు సీఎం అయ్యారు. బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రాలేదు. రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు మాఫీ కాలేదు. బాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.87 వేల కోట్ల రైతు రుణాలుండేవి.
ఆయన రుణాలు చెల్లించొద్దు అన్నందుకు రైతులపై రూ.25 వేల కోట్ల వడ్డీ భారం పడింది. అప్పట్లో రూ.లక్ష వరకూ వడ్డీ లేకుండా, రూ.3 లక్షల వరకూ పావలా వడ్డీకి రైతులకు రుణాలు వచ్చేవి. చంద్రబాబు మాటలు విని రుణాలు కట్టనందుకు రూ.2 వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు మాత్రం వడ్డీలో మూడోవంతుకు కూడా సరిపోని మాఫీ పథకం అమలు చేశారు. డ్వాక్రా మహిళలను కూడా మోసం చేశారు. వారికి గతంలో పావలా వడ్డీకి, వడ్డీలేని రుణాలు వస్తుండేవి. బాబు సీఎం అయిన తర్వాత రూ.2 వడ్డీ చెల్లిస్తున్నారు. బాబు మాత్రం ముష్టివేసినట్లు రూ.3 వేలు బ్యాంకుల చేత అప్పులు ఇప్పించి అదే రుణమాఫీ అంటున్నారు. ఎన్నికలకు ముందు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబు సీఎం జాబులో కూర్చున్నారు. కానీ, ఉన్న జాబులన్నీ పీకేస్తున్నారు. జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఎవరికైనా వచ్చిందా? చంద్రబాబు లేనిపోని హామీలతో ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు.
 రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టారు
కనీసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఏదైనా సాధిస్తారనుకుంటే అదీ లేదు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీకి ఎలాంటి అల్టిమేటం ఇవ్వలేదు. అల్టిమేటం ఇస్తే రెండేళ్ల పాలనలో అక్రమాలపై నరేంద్రమోదీ సీబీఐతో విచారణ చేయించి, జైల్లో పెట్టిస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. బాబు తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం వద్ద పణంగా పెట్టారు. ఈ రెండేళ్లలో పూర్తిగా అవినీతిలో మునిగిపోయారు. ఇసుక నుంచి బొగ్గుదాకా, రాజధాని నుంచి దేవాలయ భూముల వరకూ అంతా అవినీతే. ఏ స్థాయిలో అవినీతి జరిగిందంటే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 కోట్లు ఎరచూపుతున్నారు. ఇప్పటిదాకా 19 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. వీరి కొనుగోలుకు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత మొత్తంలో అవినీతి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 
 చంద్రబాబుకు కేసీఆర్ దీవెనలు
రాయలసీమలో నీళ్లుండవు. పంటలు పండక, పనుల్లేక ప్రజలు కేరళ, బెంగళూరుకు వలస వెళ్తున్నారు. మనకు శ్రీశైలం నీళ్లే దిక్కు . శ్రీశైలం నిండితే తప్ప నాగార్జునసాగర్‌కు నీరు రాదు. రెండూ నిండితేనే కృష్ణా డెల్టా పారుతుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీళ్లు తోడుతోంది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ సర్కారు కట్టే ప్రాజెక్టులు పూర్తయితే కిందికి  చుక్కనీరు రాదు. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చంద్రబాబు నిలదీయడం లేదు.
దీనికి కారణం.. తెలంగాణలో టీడీపీ నేతను ఎమ్మెల్సీని చేసేందుకు అడ్డగోలుగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ఉపక్రమించడమే. ఎమ్మెల్యేకు సూట్‌కేసులతో బ్లాక్‌మనీ ఇస్తూ ఆడియో, వీడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో ఏడాదైనా చంద్రబాబును అరెస్టు చేయలేదు. దీనికి కారణం కేసీఆర్ దీవెనలే. తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టినా చంద్రబాబు ప్రశ్నించరు. కాబట్టే కేసీఆర్ దీవెనలున్నాయి. ఒకవేళ ప్రశ్నిస్తే ఆడియో, వీడియో టేపులను బయటకు లాగి చంద్రబాబును జైల్లో పెడతారు. అందుకే ఆయన మౌనంగా ఉంటున్నారు.
 రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబును ఏం చేయాలని అడుగుతున్నా. (ఈ సమయంలో ప్రజలంతా చెప్పులతో కొట్టాలి.. కొట్టాలి అని బిగ్గరగా బదులిచ్చారు) మనం కలిసికట్టుగా ఒక్కటై.. మోసం చేసిన చంద్రబాబుకు ఎప్పుడు చెప్పులు చూపించడం మొదలుపెడతామో అప్పుడు ఆయన మనసు మారుతుంది. ఆరోజు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను పూర్తిగా మాఫీ చేస్తారు. మోదీకిఅల్టిమేటం ఇస్తారు. ప్రత్యేక హోదా కూడా ఆరోజు వస్తుంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మనం ఆ పని చేయడం లేదు కాబట్టే ఆయన ఈ స్థాయికి బరితెగించారు.
ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎవరూ ఏమీ అనకూడదట. ఆయన మాత్రం ఏమైనా చెప్పొచ్చు. మోసం చేయొచ్చు. మనం ఎవరినైనా నాయకుడిగా ఎన్నుకుంటే ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసి గొప్పగా చెప్పుకుంటాం. చంద్రబాబు లాంటి మోసగాడిని చూసినప్పుడు బాధేస్తోంది. ఇలా మోసం చేసిన వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. టీవీలో ప్రకటనలు ఇచ్చినా, మైకు పట్టుకుని మాట్లాడినా ఆ మాట శిలాశాసనం అవుతుందనే నమ్మకం అందరిలో రావాలి. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడినా అది నెరవేరుతుందన్న నమ్మకం లేదు. చంద్రబాబు అవసరం ఉన్నప్పుడు పూలదండ వేస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత వెన్నుపోటు పొడుస్తారు. చంద్రబాబును ఆయన భార్య కూడా నమ్ముతుందో, లేదో!’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
 అధికార టీడీపీ నేతల బరితెగింపు
కదిరిలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వేలసంఖ్యలో జనం తరలిరావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభలో జగన్ ప్రసంగం ముగించుకుని రోడ్డుపై కిలోమీటరు మేర వేలసంఖ్యలో ఉన్న కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతటితో ఆగక మిద్దెలపై నుంచి రాళ్లు విసిరారు. దీంతో జగన్ ప్రచార రథం అద్దాలు ధ్వంసమయ్యాయి. కొన్ని రాళ్లు కార్యకర్తలపై పడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని అందరినీ చెదరగొట్టారు. అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టినా వైఎస్ జగన్ చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
Share this article :

0 comments: