రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం

రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం

Written By news on Monday, June 13, 2016 | 6/13/2016


రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం
విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ జగన్ అధ్యక్షతన..
తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

 సాక్షి, హైదరాబాద్:ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 14న(మంగళవారం) విజయవాడలో జరుగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్తాయి విస్తృత సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బందర్ రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలతో సహా పలు ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారపక్షం వైఫల్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రతిపక్షాలపైనా, మీడియాపైనా కొనసాగుతున్న అణచివేత వైఖరి వంటి అంశాలతో పాటుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే పార్టీ కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లాల్సిన తీరుపై చర్చ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ విస్తృత సమావేశంలో పార్టీ శ్రేణులకు, నేతలకు, ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 14న ఉదయం 8 నుంచి 9.45 గంటల వరకు మీటింగ్ హాలు వద్ద ప్రతినిధులను నమోదు చేసుకుని ఎంట్రీ పాసులు జారీ చేస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

 సమావేశానికి ఆహ్వానితులు వీరే!
 ఈ సమావేశానికి పీఏసీ, సీజీసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ పరిశీలకులు, జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, పార్లమెంటు పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కార్పొరేటర్లు హాజరవుతారని కేంద్ర కార్యాలయం పేర్కొంది.
Share this article :

0 comments: