బాబే క్షమాపణ చెప్పాలి: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబే క్షమాపణ చెప్పాలి: వాసిరెడ్డి పద్మ

బాబే క్షమాపణ చెప్పాలి: వాసిరెడ్డి పద్మ

Written By news on Sunday, June 5, 2016 | 6/05/2016


బాబే క్షమాపణ చెప్పాలి: వాసిరెడ్డి పద్మ
 ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచినందుకుగాను రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలపుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్కదానినీ చంద్రబాబు నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. ప్రజల్ని నమ్మించి గొంతు కోసిన చంద్రబాబు వైఖరిపైనే జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆయన ఎవరినీ వ్యక్తిగతంగా మాట్లాడ్డం లేదని స్పష్టం చేశారు.
జగన్ అన్న ఒక్కమాటను సాకుగా చూపి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా మంత్రులు, టీడీపీ నేతలు దూషిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి వాటికి బెదిరేది లేదన్నారు. చంద్రబాబు పాలనపై జగన్ ప్రజల తరఫున ఇంకా గట్టిగా మాట్లాడతారని, ప్రతిపక్ష నేతగా తన విద్యుక్తధర్మాన్ని నెరవేరుస్తారని తెలిపారు.   అప్పుడు గుర్తుకురాలేదా?: జగన్ అన్న మాటల్లో సం స్కారం లేదంటున్న టీడీపీ నేతలు, మంత్రులకు.. తాము ఆయన్నుద్దేశించి అసెం బ్లీలో సైకో అని, నేరస్తుడని నిందించినపుడు సభ్యతా సంస్కారాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. 
Share this article :

0 comments: