విలువలు లేని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విలువలు లేని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు

విలువలు లేని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు

Written By news on Wednesday, June 22, 2016 | 6/22/2016


విలువలు లేని నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు
ఎంపీ వైవీ  :దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
ఒంగోలు అర్బన్: నైతిక విలువలు లేని ప్రజాప్రతినిధులకు తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ సహకారంతో ఎంపీ లాడ్స్ ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్లు, కృత్రిమ అవయవాలను స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో మంగళవారం అందించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలన్నారు. ఇప్పటికి రెండుసార్లు మెగా జాబ్‌మేళా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశామని చెప్పారు. ఎక్కువమంది నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి లేకుండా ఉపాధి పొందలేకపోతున్నారని అటువంటి వారి కోసం త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఫ్లోరోసిస్ ఉన్న ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు నానో వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.1200 కోట్లతో పైపు లైన్ ద్వారా ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ మురళి మాట్లాడుతూ  కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులను రప్పించడంలో ఎంపీ తనదైన ముద్ర వేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత 25 ఏళ్లలో ఎంపీలు చేయలేని అభివృద్ధి వైవీ ఈ రెండేళ్లల్లో చేశారని చెప్పారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు మహంకాళి వెంకటశేషయ్య, గోపాల్‌రెడ్డి, సభ్యులు తిరుపతిస్వామి, హరికృష్ణ, బండారు లక్షయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి బుజ్జి, శింగరాజు వెంకట్రావు పాల్గొన్నారు.
 న్యాయ పోరాటం చేస్తాం
ఒంగోలు అర్బన్:  స్థానిక బండ్లమిట్టలో ఇటీవల షాపులను కూలదోసిన ప్రాంతాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరిశీలించారు. రంజాన్‌మాసంలో ఎమ్మేల్యే, అధికారులు కలిసి తమని రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముస్లింల షాపులను మాత్రమే తొలగించారని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి జీవనం కొనసాగిస్తున్న వారిపై ఈ విధమైన చర్యలు తీసుకోవడం సహించరాని విషయమన్నారు.
ముందుస్తుగా నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా పోలీసుల సాయంతో గుడ్డిగా వ్యవహరించారని చెప్పారు. నగర అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదని అయితే బాధితులకు ముందుగానే ప్రత్యామ్నాయం చూపి, చర్చలు జరిపి అందరి సహకారంతో పార్కులు, బోటింగ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శింగరాజు వెంకట్రావు బాధితులకు జరిగిన నష్టాన్ని ఎంపీకి వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, వాణిజ్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్ క్రాంతికుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, కె.వి. ప్రసాద్, టి. సోమశేఖర్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: