నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ

నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ

Written By news on Sunday, June 5, 2016 | 6/05/2016


► హాజరుకానున్న వైఎస్సార్‌సీపీ
► అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
► పార్టీ శ్రేణులు తరలిరావాలని జిల్లా 
►  అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపు

 
 
 (సాక్షిప్రతినిధి, అనంతపురం) :- ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యా లు, పోలీసుల వేధింపులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ సభ నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో తొమ్మిదిమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. తాడిపత్రి, ధర్మవరం, శింగనమల, రాప్తాడు, రాయదుర్గంతో పాటు ప్రతీ నియోజకవర్గంలో ఏదోఒక చోట కార్యకర్తలపై దాడులు, పార్టీకి చెం దిన రైతుల మామిడి చెట్ల నరికివేత, డ్రిప్, స్ప్రింక్లర్ల ధ్వంసం, గొర్రెల అపహరణ వంటివి జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.

వీటి గురించి తెలిసినా, బాధితుల నుంచి ఫిర్యాదులు అందినా పోలీసులు స్పందించే స్థితిలో లేరని విమర్శించారు. యాడికి మండలంలో గ్రామస్థాయి టీడీపీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారని ఏకంగా ప్రతిపక్షనేత కాన్వాయ్‌ని కాసేపు ఆపాలంటూ పోలీసులు దౌర్జన్యం చేశారని గుర్తు చేశారు. పైగా ‘అధికారం పవర్ మీకు తెలీదు. గ్రామస్థాయి అయినా, మండలస్థాయి అయినా వారు అధికారంలో ఉన్నారు.. మీరు లేరు’ అని సీఐ న రేంద్రరెడ్డి బాహాటంగా వ్యాఖ్యానించారంటే పోలీసులు అధికార పార్టీ నేతలకు ఎలా వత్తాసు పలుకుతున్నారో స్పష్టమవుతోందని తెలిపారు. మంత్రి కాన్వాయ్‌కు ఇలాగే అడ్డుపడితే పోలీసులు ఊరుకుం టారా? అని ప్రశ్నించారు. కదిరిలో కూడా రైతు భరోసా యాత్రలో అలజడి సృష్టించాలని టీడీపీ నేతలు యత్నించడం దారుణమని పేర్కొన్నారు. వీటన్నిటికీ నిరసనగానే ప్రజాస్వామ్య పరిరక్షణ సభ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల రోజుల్లో ఎలాంటి రాజకీయ పార్టీకానీ, ప్రజా సంఘాలు కానీ పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఆందోళనలు, ధ ర్నాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

 ఆంతర్యమేమిటో..?
 పోలీస్ యాక్ట్ అమలు చేయాలంటే ముందుగానే ప్రకటిం చాలి. ఒకటో తేదీ నుంచి నెల రోజులపాటు యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ నాలుగు రోజుల తర్వాత ప్రకటిం చడంపై అను మానాలు వ్యక్తమవుతున్నాయి. అనం తపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరి రక్షణ సభ నిర్వహి స్తుండటం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవు తుండటంతో అడ్డుకోవడం కోసమే పోలీస్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Share this article :

0 comments: